Labels

APSF

Thursday 17 February 2022

జిల్లా వ్యాప్తంగా హాస్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి----ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ ఎస్ ఎఫ్ ( APSF )రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర

 జిల్లా వ్యాప్తంగా హాస్టల్ లో నెలకొన్న  సమస్యలను పరిష్కరించండి -- జిల్లా బిసి డిడి యుగంధర్ ని కలిసి విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ ఎస్ ఎఫ్ ( APSF )రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర.
నేడు స్థానిక బీసీ వెల్ఫేర్ జిల్లా కార్యాలయం నందు జిల్లా డి డి గారిని కలిసి పలు సమస్యల మీద ప్రస్తావించి వినతిపత్రం అందజేయడం జరిగింది.
 ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ( APSF ) రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్స్ లో ఉన్నటువంటి సమస్యలు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని, వార్డెన్లు స్థానికంగా ఉండాలని, అన్ని హాస్టల్లో బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని,
 హాజరు పట్టిక నమోదు చేసి నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని, జిల్లావ్యాప్తంగా మెస్ బిల్లులు సరిగా పడలేదని కుంటి సాకు తో వార్డెన్లు విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టక పోవడాన్ని వారు


తప్పు పడ్డారు. మెనూ ప్రకారం విద్యార్థులందరికీ నాణ్యమైన పౌష్టికాహార భోజనాన్ని, గుడ్డును తప్పకుండా అందించాలని,ఈ సమస్యలన్నీ సకాలంలో పరిష్కరించకుంటే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఉద్యమం చేయాల్సి వస్తుందని  హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్, జిల్లా కార్యదర్శి వినయ్, నగర నాయకులు రవి,తేజ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.













 

Wednesday 16 February 2022

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాల శేషగిరి గారి ని కలిసిన APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర

ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర

 అనంతపురం R& B అతిథి గృహం నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాల శేషగిరి గారి ని  మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియ జేసిన


ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర .  బలిజ కాపు ల కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. విదేశీ విద్య దీవెన మరియు వాహన రుణం పథకాల్ని పునరుద్ధరించాలని కోరారు.




 

Monday 14 February 2022

పుల్వామా అమరవీరులకు APSF ఘన నివాళి

 *పుల్వామా అమరవీరులకు APSF ఘన నివాళి* 

*దిశ DSP ఆర్ల శ్రీనివాసులు

*APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర  

 


























ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ APSF ఆధ్వర్యంలో బ్లాక్ డే సందర్భంగా పుల్వామా దాడిలో అమరులైన 40 మంది వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించి,*APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర అధ్యక్షతన విద్యార్థి -యువత -దేశభక్తి అంశంపై సదస్సు* నిర్వహించడం జరిగింది.

 *అతిథులుగా మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెప్టెన్ షేకన్న, గౌరవ అధ్యక్షులు కెప్టెన్ రావు, ప్రముఖ న్యాయవాది లాయర్ జయరామి రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ నాగలింగ రెడ్డి, NCC ప్రోగ్రామ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ రంగనాథ్, అధ్యాపకులు నాగభూషణం, చలపతి విజయలక్ష్మి ,APSF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురేష్ వినయ్ జిల్లా నాయకులు భాస్కర్ రెడ్డి ,* కామేష్ ,రవి, తేజ ,హరీష్ , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Monday 7 February 2022

విద్యార్థి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర www.apsf.in

 విద్యార్థి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర

ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నేడు అనంతపురం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ముట్టడి.

నేడు నగరంలో ఆర్ట్స్ కళాశాల నుండి టవర్ క్లాక్ మీదుగా కోర్ట్ రోడ్డు ఉపాధి కల్పన కార్యాలయం వరకు ర్యాలీ నిరసన అనంతరం ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ ఎస్ ఎఫ్ APSF రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర  మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ను నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. డిగ్రీ పీజీ బీటెక్ ఎంటెక్ పట్టాలు ఒక చేత పట్టుకుని మరో చేత్తో విద్యార్థి యువత పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కల్పన కల్పించడంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేవలం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ద్వారా వాచ్ మెన్, సెక్యూరిటీ గార్డులు భర్తీ చేస్తున్నారు తప్ప ఏపీపీఎస్సీ ప్రకారం గ్రూప్స్ ఉద్యోగాలు , టీచర్ ఉద్యోగాలు, వైద్య పోలీసు ఉద్యోగాలు, యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు గాని నియామకం చేపట్టలేదు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మూడు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో  Nsui రాష్ట్ర కార్యదర్శి నరేష్్ జిల్లా అధ్యక్షులు సురేష్, కార్యదర్శి వినయ్, NSUI జిల్లా అధ్యక్షులు ఓబులేసు కార్యదర్శి దాదు,గిరి APSF నాయకులు రామ్ నాయక్ ,ప్రకాష్, శేఖర్ పాల్గొన్నారు.













Blogger Gadgets